ఆర్థిక ఇబ్బందులతో గంజాయి స్మగ్లింగ్.. సికింద్రాబాద్ లో ఇద్దరు మహిళలు అరెస్ట్

ఆర్థిక ఇబ్బందులతో గంజాయి స్మగ్లింగ్.. సికింద్రాబాద్ లో ఇద్దరు మహిళలు అరెస్ట్
  • 7.8 కిలోల సరుకు సీజ్

పద్మారావునగర్, వెలుగు: విశాఖ నుంచి గోదావరి ఎక్స్​ప్రెస్​లో హైదరాబాద్​కు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను రైల్వే, ఈగిల్, ఆర్​పీఎఫ్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 3.93 లక్షల విలువైన 7.866 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి జిల్లా అరకు లోయ మండలం బొందం గ్రామానికి చెందిన పాంచాడి రుక్మిణి, శెట్టి కాసులమ్మ గతంలోనూ ముంబై, విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. 

జైలు నుంచి విడుదలైన తర్వాత అదే జిల్లాకు చెందిన ఈశ్వరరావు (A1) అనే వ్యక్తి  పరిచయంతో తిరిగి అక్రమ రవాణా మొదలుపెట్టారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వీరికి ఒక్కొక్కరికి రూ. వేల చొప్పున ఇస్తానని ఈశ్వరరావు.. ఈ నెల 10న విశాఖ రైల్వే స్టేషన్​లో నాలుగు గంజాయి ప్యాకెట్లను అందజేసి సికింద్రాబాద్​కు పంపించాడు. శనివారం ఉదయం సికింద్రాబాద్ చేరుకున్న వీరిని పక్కా సమాచారంతో జనరల్ వెయిటింగ్ హాల్​వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఈశ్వరరావు కోసం గాలిస్తున్నారు.