ఓల్డ్‌సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీ పోలీసులు శనివారం పేట్లబురుజు సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. హోదాలు పక్కనబెట్టి ఉన్నతాధికారులు, సిబ్బంది ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు.
నిత్యం విధులతో బిజీగా ఉండే పోలీసులకు మానసిక ఉల్లాసం కలిగించేందుకు ఈ వేడుకలను నిర్వహించామని, విధుల్లో కూడా ఇదే ఉత్సాహం చూపిస్తూ ప్రజల రక్షణ కోసం పనిచేయాలని సీపీ పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో జాయింట్ సీపీ శ్వేత, పలువురు డీసీపీలు, పెద్ద సంఖ్యలో సిబ్బంది పాల్గొన్నారు.
