ప్రెస్ క్లబ్ స్థలం లీజు పొడిగించండి : క్లబ్ అధ్యక్షుడు విజయ్కుమార్ రెడ్డి

ప్రెస్ క్లబ్ స్థలం లీజు పొడిగించండి : క్లబ్ అధ్యక్షుడు విజయ్కుమార్ రెడ్డి
  • సీఎంకు క్లబ్ అధ్యక్షుడు విజయ్​కుమార్ ​రెడ్డి వినతి 

పంజాగుట్ట, వెలుగు: హైదరాబాద్​లోని సోమాజిగూడ ప్రెస్​క్లబ్ స్థలం లీజును 99 ఏండ్ల పాటు పొడిగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రెస్​క్లబ్ అధ్యక్షుడు విజయ్​కుమార్​ రెడ్డి కోరారు. సోమవారం అసెంబ్లీలోని ఆఫీసులో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్యమంత్రికి ఆయన వినతిపత్రం అందజేశారు. ప్రెస్​క్లబ్ నిర్వహించే సామాజిక బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని నామమాత్రపు ధరకు స్థలాన్ని శాశ్వతంగా కేటాయించాలని కోరారు.

ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని విజయ్​కుమార్​ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సత్వరమే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారని చెప్పారు. విజయ్ కుమార్ రెడ్డి వెంట ప్రెస్​క్లబ్ ప్రధాన కార్యదర్శి వి.రమేశ్, తదితరులు ఉన్నారు.