
హైదరాబాద్, వెలుగు: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్ సెమీఫైనల్లో హైదరాబాద్‌ను విజయం ఊరిస్తోంది. చెన్నైలోని ఏఎం జైన్ కాలేజ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హర్యానా ముందు మంచి టార్గెట్‌ను ఉంచింది.
ఓవర్‌నైట్ స్కోరు 49/1తో మూడో రోజు, మంగళవారం ఆట కొనసాగించిన హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 79.3 ఓవర్లలో 254 రన్స్‌కు ఆలౌటైంది. ఎ. వరుణ్ గౌడ్ (91) అద్భుత ఆటతో జట్టును ఆదుకున్నాడు. హిమ తేజ (41) కూడా రాణించాడు. హర్యానా బౌలర్లలో నిఖిల్ కశ్యప్ (5/80) ఐదు వికెట్లతో దెబ్బకొట్టాడు. అనంతరం 272 రన్స్ టార్గెట్‌తో ఛేజింగ్‌కు వచ్చిన హర్యానా మూడో రోజు ఆట చివరకు 4 ఓవర్లలో 6/2తో పోరాడుతోంది. చివరి రోజు హర్యానా జట్టు విజయానికి ఇంకా 266 రన్స్ అవసరం కాగా, హైదరాబాద్‌కు 8 వికెట్లు కావాలి.