V6 News

18.85 కిలోల గంజాయి సీజ్ సికింద్రాబాద్లో ఇద్దరు అరెస్ట్

18.85 కిలోల గంజాయి సీజ్ సికింద్రాబాద్లో ఇద్దరు అరెస్ట్

పద్మారావునగర్, వెలుగు: రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు రైళ్ల ద్వారా సాగుతున్న అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణాను హైదరాబాద్ రైల్వే పోలీసులు అడ్డుకున్నారు. ప్లాట్​ఫారం నంబర్ 6 వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మహారాష్ట్రకు చెందిన సూరజ్ అనిల్ యాదవ్, ప్రసాద్ మహాదేవ్ మొహితే అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న బ్యాగుల నుంచి రూ. 9.42 లక్షల విలువైన 18.85 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితులిద్దరూ జగదీష్ అనే వ్యక్తి సూచనల మేరకు రాజమండ్రిలో కుమార్ అనే సప్లయర్ వద్ద గంజాయి తీసుకుని, ఒక్కొక్కరు రూ. 10 వేల కమీషన్ కోసం షోలాపూర్​కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.