హైదరాబాద్ సిటీలో ఉరుములు, మెరుపులు.. పిడుగులతో కుండపోత వాన

హైదరాబాద్ సిటీలో ఉరుములు, మెరుపులు.. పిడుగులతో కుండపోత వాన

ఓరి దేవుడా.. ఏంటీ వర్షం.. ఏంటీ బీభత్సం.. ఇదేం వాన బాసూ.. ఈ కుండపోత వర్షం ఏంటీ ఇదీ హైదరాబాద్ సిటీ జనం మాట.. మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండ ఉండాల్సిన టైంలో.. కారు మబ్బులు.. ఉరుములు, మెరుపులు.. వీటితోపాటు బీభత్సమైన వర్షం హైదరాబాదీలను వణికించింది. 2025, సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.. వాన బీభత్సాన్ని చూపించింది. నాన్ స్టాప్ గా పడిన వానతో.. రోడ్లు జలమయం.. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.. ఇవి రోడ్లా లేక నదులా అన్నట్లు నీటి ప్రవాహం.. ధైర్యం చేసి బయటకు అడుగు పెట్టలేనంతగా వాన బీభత్సంతో భయపెట్టాడు వరుణుడు.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, ఫిలింనగర్, ఎర్రగడ్డ, బోరబండ, మోతినగర్, సనత్ నగర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాల్లో అయితే కుంభ వృష్టిగా పడింది. ఆకాశానికి చిల్లు పడ్డట్టు ఎడతెరిపి లేకుండా పడిన వర్షంతో రోడ్లపై వరద పోటెత్తింది.  బంజారాహిల్స్ లోని దేవర కొండ బస్తీ నీట మునిగింది.

రాజేంద్రనగర్, అత్తాపూర్. మైలార్ దేవ్ పల్లి, బండ్లగూడ. కిస్మాత్ పూర్, హిమాయత్ సాగర్.  నార్సింగ్, కోకాపేట్, గండిపేట్. మణికొండ, పుప్పాలగూడ ఏరియాల్లో భారీ వర్షం పడింది. కూకట్ పల్లి, మియాపూర్ ఏరియాల్లో దంచికొట్టింది వర్షం.

 ఖైరతాబాద్, మియాపూర్,ఉప్పల్, బాలాపూర్, అమీర్ పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్,  దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, కోటి, అబిడ్స్, లక్డికపుల్, బషీర్  బాగ్ లో  భారీ వర్షానికి రోడ్ల పై వరద నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. 

సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. రానిగంజ్, ప్యారాడేజ్, బేగంపేట్,రాంగోపాల్ పేట్, మోండా మార్కెట్. బన్సీలాల్ పేట్. సీతాఫల్ మండి.బౌద్ధ నగర్, మెట్టుగూడ, అడ్డగుట్ట,మారేడు పల్లి, సికింద్రాబాద్ జేబీఎస్, కార్ఖన, తిరుమల గిరి,బోయిన్ పల్లి తోపాటు తదితర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. 

కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాలలోనూ వర్షం పడుతోంది.సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ,దుండిగల్, గుండ్లపోచంపల్లి,మల్లంపేట్, బహుదూర్ పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూర్ నగర్, గాజులరామారంలో వర్షం పడుతోంది.  దిల్ సుఖ్ నగర్, కొత్త పేట, మలక్ పేట లో  మోస్తరు వర్షం పడుతోంది.  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, తుర్కయాంజల్ మునిసిపాలిటీ కమ్మగూడలో శాంతినగర్ లో ఇండ్ల మధ్యలో  వర్షం నీళ్లు నిలిచిపోయాయి.