సీసీటీవీల్లో హైదరాబాద్ రికార్డ్

సీసీటీవీల్లో హైదరాబాద్ రికార్డ్

ప్రపంచ టాప్ 20 సర్వైలెన్స్ సిటీస్ లో 16 ర్యాంక్

సిటీలో కోటి మందికి 3 లక్షల సీసీటీవీ కెమెరాలు

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్ సిటీలో సీసీటీవీ కెమెరాల సర్వైలెన్స్ కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిందని డీజీపీ మహేందర్‌ రెడ్డి వెల్లడించారు. ‘యూకే కంపారి‌‌టెక్‌‌’ నిర్వహించిన సర్వేలో ప్రపంచంలోని టాప్‌‌ 20 మోస్ట్‌‌  సర్వైలెన్స్ సిటీస్‌‌లో హైదరాబాద్‌‌ సిటీకి 16వ ర్యాంక్‌‌ దక్కిందన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌‌లో భాగంగా సిటీ కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటు చేసిన 3 లక్షల సీసీటీవీ కెమెరాల సర్వైలెన్స్ తో సిటీకి ఈ ర్యాంక్‌‌ వచ్చిందన్నారు. ఇందుకు సహకరించిన సిటిజన్స్ తో పాటు పోలీసులకు అభినందనలు తెలియజేశారు. చైనాతో పాటు ఇంగ్లాండ్‌‌ సిటీస్‌‌తో కలిసి 16వ స్ధానంలో నిలించింది . ఇందులో చైనాలోని 18 సిటీస్‌‌ ఇంగ్లాండ్‌‌లోని లండన్‌‌ సిటీ, హైదరాబాద్‌‌లో ప్రతీ వెయ్యి మందికి ఉన్న సీసీ కెమెరాల సర్వె లెన్స్‌‌ గుర్తించింది . చైనాలోని టైయుహాన్‌‌ సిటీ.. 38 లక్షల 91 వేల 127 మందికి 4 లక్షల 65 వేల 255 సీసీ కెమెరాలతో ఫస్ట్‌‌ ర్యాంక్‌‌ దక్కిం చుకుందని డీజీపీ చెప్పారు. లండన్‌‌లో 93 లక్షల  4 వేల 016 మందికి 6 లక్షల 27 వేల 727 సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ లో కోటి నాలుగు వేల 144 మందికి 3 లక్షల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని వివరించారు.