హైదరాబాద్‌సిటీ, వెలుగు: సంక్రాంతి ముగియడంతో ఆదివారం నుంచే జనాలు నగరానికి తిరిగి వస్తుండడంతో ప్రధాన చౌరస్తాలు, మెయిన్‌రోడ్లన్నీ బిజీగా మారాయి. స్టూడెంట్స్, ఎంప్లాయీస్సెలవులు పూర్తి కావడంతో సోమవారం తెల్లవారుజాములోపే సిటీకి చేరుకోవాలని బయలుదేరారు. దీంతో ప్రైవేట్ట్రావెల్స్, ఆర్టీసీ బస్సులు కిటకిటలాడి వచ్చాయి.
ఆదివారం అమావాస్య కావడంతో కొందరు శనివారమే ప్రయాణాలు ప్రారంభించగా, మిగిలినవారు సోమవారం తెల్లవారుజామున వచ్చారు. దీంతో హైదరాబాద్ లో రోడ్లన్నీ స్కూల్స్‌కు వెళ్లే స్టూడెంట్స్, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులతో రద్దీగా మారాయి. ఉదయం, సాయంత్రం ప్రధాన ఏరియాలైన పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్, దిల్సుఖ్ నగర్, మాసబ్‌ట్యాంక్, బేగంపేట్, మెహదీపట్నం, ఐటీ కారిడార్ ఏరియాలు రద్దీగా కనిపించాయి.
కిక్కిరిసిన నేషనల్ హైవే
వాహనాలు క్యూ కట్టడంతో విజయవాడ–హైదరాబాద్ నేషనల్హైవే కిక్కిరిసిపోయింది. కార్లు వరుస పెట్టాయి. టూ వీలర్లు కూడా ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ఛత్తీస్‌గఢ్ హైవే వైపు మళ్లే వాహనాలకూ ఆలస్యం తప్పలేదు. కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 20 వేల వాహనాలు వెళ్లినట్టు అధికారులు తెలిపారు. ఎనిమిది టోల్ కౌంటర్లు తెరిచినా ఫాస్టాగ్ స్కానింగ్ ఆలస్యం కారణంగా వాహనాలు పొడవైన వరుసల్లో నిలిచాయి.
నందిగామ వైజంక్షన్ వద్ద సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాలను మళ్లించడంతో ప్రయాణానికి ఎక్కువ సమయం పట్టింది. ఫ్లైఓవర్‌పై కార్లకే అనుమతి ఇవ్వడంతో మిగతా వాహనాలకు ఇబ్బందులు తప్పలేదు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఉన్నతాధికారుల నుంచి ఫీల్డ్లెవెల్స్టాఫ్వరకు రోడ్లపైనే ఉన్నారు.
సాయంత్రం కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చే భారీ వాహనాలను తాత్కాలికంగా నిలిపివేసి, సాధారణ ప్రయాణికుల వాహనాలకు మాత్రమే అనుమతి చ్చారు. డ్రోన్ల ద్వారా రోడ్లపై పరిస్థితిని పర్యవేక్షించారు. నందిగామ వై జంక్షన్ వద్ద వేగం తగ్గించే స్టాపర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
