హైదరాబాద్‌సిటీ, వెలుగు: సిటీలోని వాహన దారులకు ఫ్యాన్సీ నంబర్లపై రోజు రోజుకూ క్రేజ్పెరుగుతోంది. శుక్రవారం ఆర్టీఏ సెంట్రల్జోన్అయిన ఖైరతాబాద్‌లో ఫ్యాన్సీ నెంబర్ల వేలం నిర్వహించగా, రూ. 65.38 లక్షల ఆదాయం వచ్చింది. టీజీ09హెచ్9999 నంబర్‌ను హానర్ ప్రైమ్హౌసింగ్ఎల్ఎల్పీ రూ.22,72,222 కు సొంతం చేసుకున్నారు.
టీజీ 09జె0009 నంబర్‌ను దండు ఎనర్జీ ప్రైవేట్లిమిటెడ్ రూ. 6,80,000కు, టీజీ09జె0006 నంబర్‌ను సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ రూ.5,70,666 కు, టీజీ09జె0099 నంబర్‌ను గోదావరి ఫార్చూన్ రూ.3,40,000కు, టీజీ 09జె0001 నంబర్‌ను శ్రీనిధి ఐటీ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్రూ. 2,60,000కు, టీజీ 09జె0005 నంబర్‌ను నిహారిక ఎంటర్టెయిన్మెంట్ సంస్థ రూ.2,40,100 కు, టీజీ09జె0018 న నంబర్‌ను రోహిత్‌రెడ్డి ముత్తు రూ.1,71,189 కు, టీజీ09జె0007 నంబర్‌ను శ్రీనివాస్‌నాయుడు కుందవరపు రూ.1,69,002కు, టీజీ 09జె0077 నంబర్‌ను మీనాక్షీ పవర్ప్రైవేట్లిమిటెడ్రూ.1,41,789కు, టీజీ 09జె0123 నంబర్‌ను ఆకుల మాధురి రూ.1,19,999కు, టీజీ 09జె0003 నంబర్‌ను జీఎస్ఆర్కస్ట్రక్షన్స్రూ.1,15,121 సొంతం చేసుకున్నారు.
