జీడిమెట్ల, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. బిహార్‌కు చెందిన జాన్ అమృత్(26) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జీడిమెట్లలో నివాసముంటూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతడు కావ్వ అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇటీవల భార్య డెలివరీ కోసం బిహార్‌లోని పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 14న మద్యం మత్తులో యాసిడ్ తాగాడు. సెల్ఫీ వీడియో తీసి భార్యకు పంపించాడు. ఆమె బంధువులను అతని ఇంటికి పంపింది. వారు ఉస్మానియా దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
