
మియాపూర్, వెలుగు: ఆర్టీసీ మియాపూర్–2 డిపోలో ఓ కండక్టర్ గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణఖేడ్ కు చెందిన పండరి(45) కుటుంబంతో కలిసి ఖైరతాబాద్ లో నివాసం ఉంటున్నాడు.
అతను 2010 నుంచి మియాపూర్–2 డిపో లో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు డిపోకు వెళ్లాడు. రిజిస్టర్ లో సంతకం చేసి టికెట్ మెషీన్ తీసుకున్నాడు. తోటి కండక్టర్లతో కాసేపు సరదాగా మాట్లాడి మూత్ర విసర్జనకు బాత్రూమ్ వద్దకు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. ఉద్యోగులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో 108 వాహనంలో కొండాపూర్ హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు పండరి గుండెపోటుతో మృతిచెందినట్లు నిర్ధారించారు.