గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో నిర్వహణ..పాల్గొననున్న 36 సెంట్రల్ ఫోర్సెస్‌‌‌‌, 1,646 మంది ప్లేయర్స్

గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో నిర్వహణ..పాల్గొననున్న 36 సెంట్రల్ ఫోర్సెస్‌‌‌‌, 1,646 మంది ప్లేయర్స్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: 11వ ఆలిండియా పోలీస్ జూడో క్లస్టర్ చాంపియన్‌‌‌‌ షిప్–-2026 పోటీలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో వేదికైంది. సెంట్రల్ ఇండస్ట్రీయల్‌‌‌‌ సెక్యూరిటీ ఫోర్స్‌‌‌‌ (సీఐఎస్‌‌‌‌ఎఫ్) ఆధ్వర్యంలో ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఏఐపీఎస్‌‌‌‌సీబీ) సహకారంతో ఈ నెల 23 నుంచి నిర్వహిస్తున్న ఛాంపియన్ షిప్‌‌‌‌లో దేశవ్యాప్తంగా 36 రాష్ట్ర పోలీసు, కేంద్ర సాయుధ పోలీసు దళాల (సీఏపీఎఫ్) నుంచి 1,646 మంది  క్రీడాకారులు పాల్గొంటున్నారు.

.ఈ మేరకు నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (నిసా)లో సోమవారం కర్టెన్ రైజర్ కార్యక్రమం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐఎస్‌‌‌‌ఎఫ్ నిసా డైరెక్టర్, ఐజీ హర్‌‌‌‌ప్రీత్ కౌర్ సోహి వెల్లడించారు. జూడో క్లస్టర్ ఛాంపియన్‌‌‌‌ షిప్‌‌‌‌ ఈ నెల 23 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ పోటీల్లో  జూడో, ఉషూ, తైక్వాండో, కరాటే, పెన్‌‌‌‌కాక్ సిలాట్ అనే ఐదు మార్షల్ ఆర్ట్స్ విభాగాల్లో పోటీలు జరగనున్నట్టు అధికారులు తెలిపారు.

 2026 ఆసియా క్రీడల్లో జూడో, ఉషూ, తైక్వాండో, కరాటే పతకాల విభాగాలుగా ఉండటంతో  ఛాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడిందని తెలిపారు. పోలీసు, సీఏపీఎఫ్‌‌‌‌లకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు ఇది కీలక వేదిక అవుతుందన్నారు. ఒలింపియన్ పారుపల్లి కశ్యప్, రోయింగ్ కోచ్ ఇస్మాయిల్ బేగ్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదల, జట్టు భావన వంటి లక్షణాలు యూనిఫాం సిబ్బందికి అవసరమని పేర్కొన్నారు.