సీఎంసీలో ‘వాక్ ఫ్రీ’ స్పెషల్ డ్రైవ్..697 ఫుట్‌‌పాత్ ఆక్రమణల తొలగింపు

సీఎంసీలో ‘వాక్ ఫ్రీ’ స్పెషల్ డ్రైవ్..697 ఫుట్‌‌పాత్ ఆక్రమణల తొలగింపు

 హైదరాబాద్ సిటీ, వెలుగు:  సీఎంసీలో శనివారం ‘వాక్ ఫ్రీ’ పేరుతో  ఫుట్‌‌పాత్ ఆక్రమణల తొలగింపు డ్రైవ్ నిర్వహించారు. కమిషనర్, జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో మూడు జోన్ల పరిధిలో చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో మొత్తం 697 ఆక్రమణలను తొలగించారు.

శేరిలింగంపల్లి జోన్‌‌లో నార్సింగి పైప్‌‌లైన్ రోడ్, పటాన్‌‌చెరు రేడియల్ రోడ్–30, తెల్లాపూర్, అమీన్‌‌పూర్ బీరంగూడ మెయిన్ రోడ్, మియాపూర్–చందానగర్ ఎన్‌‌హెచ్-65, శేరిలింగంపల్లి బొటానికల్ గార్డెన్ రోడ్‌‌లలో డ్రైవ్ నిర్వహించి, 18 కిలోమీటర్ల మేర 292.. కూకట్‌‌పల్లి జోన్‌‌లో మాదాపూర్ హుడా మయూరి రోడ్, ఆల్విన్ కాలనీ పైప్‌‌లైన్ రోడ్, కూకట్‌‌పల్లి బీఎస్‌‌ఎన్‌‌ఎల్ లేన్, మూసాపేట్ డాన్ బోస్కో రోడ్, పి.ఆర్. నగర్ రోడ్‌‌లలో చేపట్టిన డ్రైవ్‌‌లో 5.9 కిలోమీటర్ల మేర140 ఆక్రమణలను కూల్చేశారు.

కుత్బుల్లాపూర్ జోన్‌‌లో చింతల్ రంగానగర్ మెయిన్ రోడ్, జగద్గిరిగుట్ట మెయిన్ రోడ్, జీడిమెట్ల సుచిత్ర ఎక్స్ రోడ్, కొంపల్లి–కుత్బుల్లాపూర్ ఎక్స్ రోడ్, గాజులరామారం దేవేందర్ నగర్ రోడ్, నిజాంపేట్ ప్రగతి నగర్ రోడ్, దుండిగల్ ఓఆర్‌‌ఆర్ సర్వీస్ రోడ్, మేడ్చల్ మెయిన్ రోడ్‌‌లలో నిర్వహించిన డ్రైవ్‌‌లో 8.45 కిలోమీటర్ల మేర 265 ఆక్రమణలను తొలగించారు.