బంజారాహిల్స్‌లో షాక్.. నీళ్లు వృథా చేసినందుకు రూ.10 వేల జరిమానా

బంజారాహిల్స్‌లో షాక్.. నీళ్లు వృథా చేసినందుకు రూ.10 వేల జరిమానా

హైదరాబాద్ జలమండలి నీటి వృథాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో భాగంగానే బంజారాహిల్స్‌లో నీటిని వృథా చేసిన ఒక వ్యక్తికి ఏకంగా రూ. 10 వేల జరిమానా విధించారు అధికారులు.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఆరెంజ్ ట్రీ ఫర్నిచర్ షాప్ దగ్గర  ఈ ఘటన జరిగింది. తాగే నీటితో ఒక వ్యక్తి షాప్ ప్రాంగణాన్ని కడుగుతుండగా.. తనిఖీల్లో ఉన్న జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. తాగునీటిని ఇతర అవసరాలకు వాడుతూ.. వృథా చేస్తున్న ఆ వ్యక్తిని గుర్తించి అక్కడికక్కడే 10 వేల రూపాయల ఫైన్ విధించారు.

ALSO READ : బండి భగీరథ్ ను కస్టడీలోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు...

ఈ సందర్భంగా జలమండలి అధికారులు ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాగునీటిని కేవలం తాగడానికి, గృహ అవసరాలకు మాత్రమే వాడాలని.. రోడ్లు కడగడానికి, వాహనాలు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. నీటి వృథాను అరికట్టడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని, నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు తప్పవని జలమండలి విజ్ఞప్తి చేస్తోంది.