వికారాబాద్: ట్రెక్కింగ్ చేస్తుండగా గుండెపోటు

వికారాబాద్: ట్రెక్కింగ్ చేస్తుండగా గుండెపోటు
  • అనంతగిరిలో మహిళ మృతి

వికారాబాద్, వెలుగు: అనంతగిరి పర్యాటక ప్రాంతానికి ట్రెక్కింగ్​ కోసం వచ్చిన ఓ పర్యాటకురాలు గుండెపోటుతో చనిపోయింది. హైదరాబాద్​ బండ్లగూడ ప్రాంతానికి చెందిన ప్రియాంక(47) కుటుంబసభ్యులతో కలిసి శనివారం అనంతగిరికి వెళ్లారు. 

రాత్రి రిసార్ట్​లో బస చేసింది. ఆదివారం ఉదయం అనంతగిరిలో ట్రెక్కింగ్​ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. అటవీ శాఖ అధికారులు వికారాబాద్​ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.