ఢిల్లీలో 23వ రోజుకు సీజేపీ ఆందోళన..క్షీణించిన సోనమ్ వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్ ఆరోగ్యం

ఢిల్లీలో 23వ రోజుకు సీజేపీ ఆందోళన..క్షీణించిన సోనమ్ వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్ ఆరోగ్యం

న్యూఢిల్లీ: పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న ఆందోళనలు ఆదివారంతో 23వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 15వ రోజుకు చేరింది. దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వైద్యులు వెల్లడించారు. వైద్యుల నివేదిక ప్రకారం.. వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్ రక్తపోటు 104/66 ఎంఎం హెచ్‌‌‌‌‌‌‌‌జీకి పడిపోయింది. దీక్ష ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన 7.8 కిలోల బరువు తగ్గారు. మరోవైపు, ఐసా విద్యార్థి సంఘం నేతలు నేహా, మనీష్, దీపక్, అమీన్ కూడా నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు. 

జూన్ 20న ప్రారంభమైన ఈ నిరసనల్లో జూన్ 28న వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్ చేరి, ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఈ ఉద్యమానికి కేరళ మాజీ మంత్రులు కేకే శైలజ, కేఎన్ బాలగోపాల్, పి. రాజీవ్, సమాజ్‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ ఎంపీ పుష్పేంద్ర సరోజ్ సంఘీభావం తెలిపారు. శనివారం విడుదల చేసిన వీడియోలో వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్ మాట్లాడుతూ "నన్ను మోడరన్ గాంధీ అనవద్దు, నేను సామాన్య పౌరుడిని. మీ జీవితానికి మీరే హీరోలై పౌర బాధ్యతలు నెరవేర్చండి" అని పేర్కొన్నారు. 

పరీక్షల అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. జులై 20న పార్లమెంట్ వరకు భారీ 
శాంతియుత మార్చ్ నిర్వహిస్తామని, దీనికి ప్రజలంతా కలిసిరావాలని వాంగ్‌‌‌‌‌‌‌‌చుక్ పిలుపునిచ్చారు.