ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లో వర్ష బీభత్సం..126 రోడ్లు బంద్

ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లో వర్ష బీభత్సం..126 రోడ్లు బంద్

డెహ్రాడూన్:  ఉత్తరాఖండ్ వ్యాప్తంగా ఆదివారం కురిసిన భారీ వర్షాల వల్ల పలుచోట్ల కొండచరియలు విరిగిపడి, రెండు జాతీయ రహదారులతో  సహా మొత్తం 126 రోడ్లు పూర్తిగా క్లోజ్ అయ్యాయి. గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్రంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం తెలిపింది. డెహ్రాడూన్‌‌‌‌‌‌‌‌లోని పథరియా పీర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ కూలి ఒక మహిళ గాయపడింది. ప్రమాదం జరగకుండా అధికారులు వెంటనే సమీపంలోని ఏడు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు స్యానాచట్టి దగ్గర కొండచరియలు విరిగిపడటంతో రిషికేశ్-యమునోత్రి జాతీయ రహదారి మూడు రోజులుగా మూసే ఉంది. అక్కడ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి.  రోడ్డును వీలైనంత త్వరగా రీ-ఓపెన్ చేసేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ బృందాలు కంటిన్యూస్‌‌‌‌‌‌‌‌గా పునరుద్ధరణ పనులు చేపడుతున్నాయి. ఎఫెక్ట్ అయిన ప్రాంతం నుంచి శిథిలాలు, భారీ బండరాళ్లను తొలగిస్తున్నామని, ఎమర్జెన్సీ రాకపోకల కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా రెడీ చేశామని అధికారులు స్పష్టం చేశారు.