అక్రమంగా రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డులు.. బెంగళూరులో పాక్‌‌‌‌‌‌‌‌ మహిళ అరెస్ట్

అక్రమంగా రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డులు.. బెంగళూరులో పాక్‌‌‌‌‌‌‌‌ మహిళ అరెస్ట్

బెంగళూరు: తమ జాతీయతను దాచిపెట్టి అక్రమంగా రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డులను పొందిన ఒక పాకిస్థాని మహిళను, ఆమె కుమారుడిని కర్నాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఫరా నాజ్, మహ్మద్ ఫర్దీన్‌‌‌‌‌‌‌‌గా గుర్తించారు. బాగేపల్లి నివాసి అయిన మహ్మద్ అయూబ్ ఖాన్ అనే వ్యక్తి యూఏఈలో ఉద్యోగం చేస్తున్న సమయంలో, అక్కడ పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఫరా నాజ్‌‌‌‌‌‌‌‌ను పెళ్లి చేసుకున్నాడు. 

వీరికి నలుగురు పిల్లలు కాగా, అందులో మహ్మద్ ఫర్దీన్ పాక్‌‌‌‌‌‌‌‌లో జన్మించాడు. అయూబ్ ఖాన్‌‌‌‌‌‌‌‌తో పాటు మిగిలిన ముగ్గురు పిల్లలు భారతీయ పౌరులు కాగా, భార్య ఫరా నాజ్, కుమారుడు మహ్మద్ ఫర్దీన్ మాత్రం పాకిస్తాన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. 

వారి రికార్డులను అధికారులు పరిశీలించగా, నిందితులు తమ జాతీయతకు సంబంధించిన కీలక విషయాలను దాచిపెట్టి అక్రమంగా రేషన్ కార్డు పొందినట్లు తెలిసింది. దీంతో వాటిని వెంటనే రద్దు చేశారు. అలాగే, ఓటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐడీని కూడా రద్దు చేశారు. ఈ ఘటనపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.