గోవాలో లవర్తో గడిపిన హైదరాబాద్ మహిళ.. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న హోటల్ సిబ్బంది !

గోవాలో లవర్తో గడిపిన హైదరాబాద్ మహిళ.. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న హోటల్ సిబ్బంది !

హైదరాబాద్ మహిళ.. రెండేళ్ల క్రితం గోవా వెళ్లింది. లవర్ తో కలిసి టూర్ ఎంజాయ్ చేసింది. ఎవరి కంటా పడలేదులే అన్నట్లుగా తిరిగి వచ్చి ఎవరి దారిని వారున్నారు. ఆ తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఆ మహిళ. ఉన్నట్లుండి గోవా నుంచి ఫోన్. మీ వీడియోలు నా దగ్గర ఉన్నాయి.. డబ్బులు ఇస్తే ఓకే.. లేదంటే వైరల్ చేస్తానంటూ బెదిరింపులు. వైవాహిక జీవితం నాశనం అవుతుంతన్న ఆందోళనతో పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ – ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన ఒక మహిళ(35), తన పెళ్లికిముందు 2023 సంవత్సరంలో ఒక వ్యక్తితో కలిసి గోవా వెళ్లింది. వారికి బస, ఇతర ఏర్పాట్లు చేసిన యశ్వంత్(40) అనే వ్యక్తి ఇటీవల మహిళకు ఫోన్ చేశాడు. గతంలో మీరు సన్నిహితంగా ఉండే వీడియోలు తీశానని, రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 

యశ్వంత్ ఫోన్ తో ఆందోళనకు గురైన మహిళ.. తనకు ఇప్పుడు వేరే వ్యక్తితో పెళ్లయిందని.. వీడియోలు డిలీట్ చేయాలని వేడుకుంది. తన వైవాహిక జీవితం చెడిపోతుందని  వదిలేయమని ప్రాధేయపడింది. ఎంత బతిమాలినా యశ్వంత్ వినకపోవడంతో, పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నా సనత్‌నగర్ పోలీసులు.