శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గురువారం హైడ్రా దూకుడు ప్రదర్శించింది. హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమలేశ్గౌడ్, ఆర్జీఐఏ ఎస్ఐ ఉమా దేవి ఆధ్వర్యంలో తమ బృందంతో గురువారం ఆక్రమణలను కూల్చేశారు.
మల్లన్న గడ్డ వద్ద ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన భారీ షెడ్డు, వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం పక్కన నిర్మించిన ఫ్రీ కాస్ట్ ను కూల్చేశారు. ఫ్రీ కాస్ట్ కూల్చివేత సమయంలో స్థానికులకు, హైడ్రా అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. అది అమ్మవారి ఆలయ స్థలమంటూ కాసేపు జేసీబీకి అడ్డుగా బైఠాయించారు. పోలీసు బందోబస్తు మధ్య ప్రహరీని కూల్చారు. హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఉన్నా ప్రహరీ కూల్చారని స్థానికులు ఆరోపించారు.
