శభాష్ హైడ్రా..! వాన నీరు నిలవకుండా హైదరాబాద్లో ఫ్లై ఓవర్లు, నాలాలు క్లీన్ చేసిన సిబ్బంది

శభాష్ హైడ్రా..! వాన నీరు నిలవకుండా హైదరాబాద్లో ఫ్లై ఓవర్లు, నాలాలు క్లీన్ చేసిన సిబ్బంది

హైడ్రా అంటే ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను స్వాధీనం చేసుకోవడం, అక్రమ నిర్మాణాలను కూల్చేయటమే కాదు.. హైదరాబాద్ ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవడం కూడా తమ బాధ్యత అంటున్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడటమే కాకుండా విపత్తు నిర్వహణ ద్వారా ప్రజలకు రక్షణ కల్పించే లక్ష్యంతో ఏర్పడిన హైడ్రా .. ఆ దిశగా చర్యలు తీసుకుంటూ నగరవాసుల మన్ననలు పొందుతోంది.

మంగళవారం (జులై 22) విపత్తు నిర్వహణలో భాగంగా నగరంలో స్వయంగా రంగంలోకి దిగి పనులు చేశారు హైడ్రా టీమ్. వ‌ర్షం ప‌డితే వ‌ర‌ద నీరు సాఫీగా వెళ్లేలా చ‌ర్యలు తీసుంటున్నారు. అందులో భాగంగా ఫ్లైఓవర్స్, ఆర్‌యూబీల పై వర్షాపు నీరు వెళ్ళే హోల్స్ ను క్లీన్ చేశారు. 

మొన్న శుక్రవారం (జులై 18)  కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ఫ్లైఓవర్ల పై నీళ్లు నిలిచి పోయాయి. కొండాపూర్‌, కొత్తగూడ, హఫీజ్‌ పేట్ ఫ్లైఓవర్ లను క్లీన్ సిబ్బంది క్లీన్ చేశారు. నీళ్లు వెళ్లే హోల్స్ లో ఉన్న మట్టిని క్లీన్ చేసి ఫ్లై ఓవర్లపై నీళ్లు నిలవకుండా చేశారు. 

►ALSO READ | వెంటనే స్టార్ట్ చేయండి: ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంత్రి వివేక్ సూచన

ఇక హైదరాబాద్ లో వర్షం వస్తే ఎక్కువగా భయపెట్టేవి నాలాలు. భారీ వర్షానికి నాలాలు ఉప్పొంగుతూ భయంకరంగా కనిపిస్తుంటాయి. చాలా సార్లు నాలాల్లో బండ్లు, మనుషులు ఇరుక్కుపోయిన సందర్భాలున్నాయి. అందుకే నాలాలు నీళ్లు నిలవకుండా క్లీన్ చేశారు. స్వయంగా నాలాల్లో నిలిచిన వేస్ట్ ను తొలగించి నీళ్లు వెళ్లేలా చేశారు. హైడ్రా సిబ్బంది చేస్తున్న పనులను చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.