
మెదక్: ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వారు వెంటనే ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని మంత్రి వివేక్ సూచించారు. మంగళవారం (జూలై 22) మెదక్ జిల్లా చేగుంటలో ఆషాడమాస బోనాల పండుగ సందర్భంగా సండ్రగు బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఫలహారం బండి ఊరేగింపు వేడుకలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహంకాళమ్మకు పూజలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణలో 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళు తప్ప.. వేరే ఇండ్లే ఇవ్వలేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ అయ్యాయని.. ఇండ్లు వచ్చిన వారు వెంటనే నిర్మాణం స్టార్ట్ చేయాలని సూచించారు. త్వరలోనే మరో 3500 ఇల్లు రాబోతున్నాయని నియోజకవర్గ ప్రజలకు శుభవార్త చెప్పారు.
►ALSO READ | త్వరలోనే ట్యాంక్ బండ్పై దాశరధి విగ్రహాం ఏర్పాటు చేస్తం
రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేద ప్రజలకు రూ.10 లక్షల వైద్యం అందిస్తున్నామని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ.9 వేల కోట్ల రూపాయలతో రేషన్ ద్వారా సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. రూ.23 వేల కోట్లతో రైతులకు ఏకకాలంలో పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు.