త్వరలోనే ట్యాంక్ బండ్‎పై దాశరధి విగ్రహాం ఏర్పాటు చేస్తం: మంత్రి జూపల్లి

త్వరలోనే ట్యాంక్ బండ్‎పై దాశరధి విగ్రహాం ఏర్పాటు చేస్తం: మంత్రి జూపల్లి

హైదరాబాద్: త్వరలోనే ట్యాంక్ బండ్‏పై దాశరథి కృష్ణమాచర్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంగళవారం (జూలై 22) తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో  దాశరథి సాహితీ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.

దాశరథి–2025 అవార్డు విజేత, ప్రముఖ కవిత అన్నవరం దేవేందర్‎కు పురస్కారం అందించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. దాశరథి కృష్ణమాచర్య–2025 అవార్డ్ అందుకున్న అన్నవరం దేవేందర్‎కి శుభాకాంక్షలు తెలిపారు. సమాజాన్ని చైతన్య పరిచేవారే కవులు, రచయితలన్నారు.

ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా కవులు ఉండకూడదని దాశరథి చెప్పారని.. అప్పుడే ప్రజల పక్షాన రచనలు పక్షపాతం లేకుండా రాయగలరన్నారు. అసమానతలు, దుర్మార్గ వ్యవస్థపై దాశరథి ఆనాడు తన కలం ద్వారా గళం విప్పారని కొనియాడారు. నిజాం నవాబు ఎన్ని ఇబ్బందులు పెట్టిన దాశరథి తలవంచలేదని.. అది ఆయన గొప్పతనమని ప్రశంసించారు. దాశరథి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని అన్నారు.

►ALSO READ | ప్రతి ఆడబిడ్డకు నా అభినందనలు.. చాలా హ్యాపీగా ఉంది: సీఎం రేవంత్

 కవులకు రిటైర్మెంట్ ఉండదని.. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ నిలదీయాలని కోరారు. స్వతంత్ర ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు కవుల పాత్ర కీలకమన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12వేల గ్రామ పంచాయతీల్లో దాశరథి పుస్తకాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.