హైదరాబాద్లో హైసియా సదస్సు.. చీఫ్ గెస్టుగా మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్లో హైసియా సదస్సు.. చీఫ్ గెస్టుగా మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసీయా) 33వ వార్షిక సదస్సు హైదరాబాద్​లో గురువారం జరిగింది.  ఏఐ, ఇంటెలిజెంట్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ల ప్రాధాన్యత గురించి సుమారు 1,200 మంది  నిపుణులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు మాట్లాడారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ కార్యక్రమాన్ని ఎస్​టీపీఐ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి తెలంగాణ ఐటీ శాఖ నిర్వహించింది.  ఎగుమతులు, వ్యాపార వృద్ధి, ఉపాధి కల్పన, మహిళా శ్రామిక శక్తి పెంపులో రాణించిన సంస్థలకు ఈ సందర్భంగా అవార్డులు ఇచ్చారు. ఏఐ మాస్టర్ క్లాసులు, స్టార్టప్ ఎక్స్ పో ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  40 ఉత్తమ స్టార్టప్ ఉత్పత్తులకు  అవార్డులు అందజేశారు.