
‘ఏజెంట్’ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ అని.. కానీ ఇందులో లవ్ స్టోరీకి ఇంపార్టెన్స్ ఉందని చెబుతోంది సాక్షి వైద్య. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది సాక్షి వైద్య. శుక్రవారం సినిమా రిలీజ్ అవుతోన్న సందర్భంగా సాక్షి మాట్లాడుతూ ‘మాది ముంబైలోని థానే. స్కూల్, కాలేజ్ చదువు అక్కడే జరిగింది. నేను ఫిజియోథెరపిస్ట్‌ని. ఇప్పుడు నటిగా మారాను.(నవ్వుతూ). ఈ కథ నాతోనే మొదలవుతుంది.
ఇందులో ‘ఏజెంట్’కి లవర్‌గా కనిపిస్తా. నాది చాలా ఇంపార్టెంట్ రోల్. మొదటి సినిమాలోనే ఇలాంటి క్యారెక్టర్ రావడం ఆనందంగా ఉంది. థియేటర్‌లో చూస్తున్నంతసేపు ఎక్స్‌యిట్‌మెంట్‌కి లోనవుతారు. అఖిల్ చాలా హంబుల్. తనతో డ్యాన్స్ చేయడం ఎంజాయ్ చేశాను. నేను భరతనాట్యం బ్యాక్‌డ్రాప్ నుంచి రావడంతో స్టెప్స్‌ని త్వరగా నేర్చుకోగలిగాను. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి బిగ్ బ్యానర్‌లో మొదటి సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా. దర్శక, నిర్మాతలు, తెలుగు ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో ‘గాండీవధారి అర్జున’ చిత్రంలో నటిస్తున్నా’ అని చెప్పింది.