యుద్ధం ఆగిపోవాలని మొక్కుకున్నా: కిషన్రెడ్డి

యుద్ధం ఆగిపోవాలని మొక్కుకున్నా: కిషన్రెడ్డి

ఇబ్రహీంపట్నం, వెలుగు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్​లో కుటుంబ సమేతంగా శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. సీతారామంజనేయ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి, సీతారాముల కల్యాణాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం అంతమై, ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని లోక కల్యాణం కోసం ప్రార్థించినట్లు తెలిపారు.అలాగే అంబర్​పేట్ లో నిర్వహించిన శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం శక్తివంతంగా ఎదగాలని ఆకాంక్షిచారు.