నువ్వు ఔటవ్వగానే నా హార్ట్‌‌‌‌ బ్రేకైంది

నువ్వు ఔటవ్వగానే నా హార్ట్‌‌‌‌ బ్రేకైంది

న్యూఢిల్లీ:   ప్రఖ్యాత లార్డ్స్‌‌‌‌  గ్రౌండ్‌‌‌‌లో 2003 నాట్‌‌‌‌వెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ ఇండియా క్రికెట్‌‌‌‌ హిస్టరీలో ఓ మధురజ్ఞాపకం. నాడు టీమ్‌‌‌‌లోకి కొత్తగా వచ్చిన యంగ్‌‌‌‌స్టర్లు యువరాజ్‌‌‌‌ సింగ్‌‌‌‌, మహ్మద్‌‌‌‌ కైఫ్‌‌‌‌  వీరోచిత పోరాటంతో ఇండియాను గెలిపించడం.. కెప్టెన్‌‌‌‌ సౌరవ్‌‌‌‌ గంగూలీ లార్డ్స్‌‌‌‌ బాల్కనీలో చొక్కవిప్పి సంబరాలు చేసుకోవడం ఫ్యాన్స్‌‌‌‌ ఇప్పటిదాక మర్చిపోలేరు. 326 రన్స్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో జట్టు 146/5తో ఓటమి అంచున నిలిచిన టైమ్‌‌‌‌లో  యువీ, కైఫ్‌‌‌‌ గొప్ప పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌తో ఇండియాను గెలిపించారు. ఆ టైమ్‌‌‌‌లో తామిద్దరం ఏం మాట్లాడుకున్నామో యువీ, కైఫ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌ లైవ్‌‌‌‌ సెషన్‌‌‌‌లో వెల్లడించారు. ‘నువ్వు (యువీ) ఔటైతే  మ్యాచ్‌‌‌‌ పోయినట్టేనని నేను అనుకున్నా. ఇక మనం నెగ్గలేమని భావించా.  అప్పటికే నేను క్రీజులో సెట్‌‌‌‌ అయ్యాను కాబట్టి మనమిద్దరం చివరిదాకా నిలిస్తే ఇండియా గెలుస్తుందని అనుకున్నా. కానీ, నువ్వు ఔటైయ్యావు. ఇండియా హోప్‌‌‌‌ కోల్పోయింది. నా హార్ట్‌‌‌‌ బ్రేకైంది’ అని యువరాజ్‌‌‌‌తో కైఫ్‌‌‌‌ చెప్పాడు. యువీ పెవిలియన్‌‌‌‌ చేరినా కైఫ్‌‌‌‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆరు బాల్స్‌‌‌‌లో ఆరు సిక్సర్లకంటే  2000 అండర్‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఆస్ట్రేలియాపై యువరాజ్‌‌‌‌ 25 బాల్స్‌‌‌‌లో 58 రన్స్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ తన ఫేవరెట్‌‌‌‌ అని కైఫ్‌‌‌‌  చెప్పాడు.  ‘ఆ ఇన్నింగ్స్‌‌‌‌లో నువ్వు.. మిచెల్‌‌‌‌ జాన్సన్‌‌‌‌, షేన్‌‌‌‌ వాట్సన్‌‌‌‌ వంటి బౌలర్లను డామినేట్‌‌‌‌ చేయడం అమేజింగ్‌‌‌‌. నువ్వు చాలా గొప్ప ఇన్నింగ్స్‌‌‌‌లు ఆడావు. ఆరు సిక్సర్లు కూడా కొట్టావు. కానీ, నాకైతే అండర్‌‌‌‌–19 లెవల్లోనే ఒకరు అలా బ్యాటింగ్‌‌‌‌ చేయడం చాలా స్పెషల్‌‌‌‌. నువ్వు చాలా దూరం వెళ్తావని, ఇండియాకు చాలా కాలం పాటు ఆడతావని మాకు అప్పుడే తెలుసు’ అని యువీతో కైప్‌‌‌‌ చెప్పుకొచ్చాడు.  కైఫ్‌‌‌‌, తాను ఇండియా ఫీల్డింగ్‌‌‌‌కు ఊపు తెచ్చామని యువరాజ్‌‌‌‌ చెప్పాడు.