అభిశంసనంపై ట్రంప్ కీలక నిర్ణయం

అభిశంసనంపై ట్రంప్ కీలక నిర్ణయం

తనపై పెట్టిన అభిశంసనంపై సెనేట్‌లో వెంటనే విచారణ జరపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు తనకి తగిన ప్రక్రియ ఇవ్వడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

‘డెమోక్రాట్లు నాకు తగిన ప్రక్రియ ఇవ్వలేదు. న్యాయవాదులు లేరు, సాక్షులు లేరు, వారిదగ్గర ఏమీ లేదు. వారు తమ విచారణను ఎలా ముందుకు తీసుకువెళ్తారో సెనేట్‌కు చెప్పాలనుకుంటున్నారు. వాస్తవానికి, వారి దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. అందువల్ల వారు ఎప్పటికీ వాటిని చూపించలేరు. వారికి నేను పదవి నుంచి తొలగిపోవడం మాత్రమే కావాలి. సాక్ష్యాలు లేని ఈ అభిశంసనంపై నాకు తక్షణ విచారణ కావాలి!’ అని ట్రంప్ గురువారం ట్వీట్ చేశారు.

‘సెనేట్‌లో అభిశంసన విచారణను కొనసాగించాలని స్పీకర్ నాన్సీ పెలోసి అనాలోచితంగా నిర్ణయం తీసుకున్నారు. డెమొక్రాట్లు తమ అభిశంసనంపై రిపబ్లికన్ల నుండి ఒక్క ఓటు కూడా పొందలేకపోయారు. రిపబ్లికన్లు ఐక్యంగా లేరు! డెమ్ కేసు చాలా ఘోరంగా ఉంది, అందువల్ల వారు విచారణ కోసం వెళ్లడానికి ఇష్టపడరు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసి అభిశంసన లేఖను సెనేట్‌లో సమర్పించడానికి భయపడుతున్నారు’ ని ట్రంప్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘అభిశంసన చాలా మోసపూరితంగా ఉందని భావించిన స్పీకర్ పెలోసి.. దానిని సెనేట్‌లో ప్రవేశపెట్టడానికి ఆమె భయపడుతుంది. అభిశంసనపై విచారణకు తేదీని ఆమె నిర్ణయించగలదు. అంతేకాకుండా డెమొక్రాట్లు ఏ సాక్ష్యాలు చూపించలేకపోతే ఈ మొత్తం అభిశంసన స్కామ్‌ని డీఫాల్ట్‌గా కూడా ఆమె ఉంచవచ్చు. ఇది మన దేశానికి చాలా చెడ్డ పేరును తీసుకువస్తుంది’ అని ట్రంప్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

For More News..

లేడీ కండక్టర్‌పై యాసిడ్ దాడి