
8 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ పర్యటనలో పూర్తి విఫలమయ్యాడు. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో అంచనాల మేర రాణించలేదు. సిరీస్ మొత్తంలో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేసి పూర్తిగా నిరాశపర్చాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ టూర్ వైఫల్యంపై నోరు విప్పాడు కరుణ్ నాయర్. ఇంగాండ్ టూర్లో తన ప్రదర్శనపై అసంతృప్తిగా ఉందన్నాడు.
ది ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన చివరిదైనా ఐదో టెస్ట్‌లో హాఫ్ సెంచరీని సెంచరీగా మల్చలేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యానని మనసులో మాట బయటపెట్టాడు. కానీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు హాఫ్ సెంచరీతో ఆదుకోవడం కాస్తా ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు కౌంటీల్లో, ఇంగ్లాండ్ ఏ జట్టుతో జరిగిన మ్యాచుల్లోనే బాగానే ఆడానని.. కానీ ముఖ్యమైన సిరీస్ లో అంతగా రాణించలేకపోయాయని నిజం ఒప్పుకున్నాడు. తన పునరాగమనాన్ని ఘనంగా చాటలనుకున్నాను కానీ.. అలా చేయలేకపోయానని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇంగ్లాండ్ పర్యటన వైఫల్యం గురించి ఆలోచించడటం పక్కనే పెట్టి.. రాబోయే మ్యాచులపై దృష్టి పెడతానన్నాడు. తప్పులను సరిదిద్దుకుని భారీ స్కోర్లు సాధించడంపై ఫోకస్ చేస్తానన్నాడు. నాయర్ ప్రస్తుతం మహారాజా ట్రోఫీ T20 టోర్నీపై దృష్టి సారించాడు. దేశవాళీ లీగుల్లో టన్నుల కొద్ది పరుగులు వరద పారించిన కరుణ్ నాయర్.. సుదీర్ఘ విరామంతో తర్వాత వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో ఇండియా జట్టులో దాదాపు కరుణ్ నాయర్ కెరీర్ ఖతమైనట్లు. తిరిగి జట్టులోకి రావాలన్న అతడి కలలు కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది.