- టికెట్ ఇప్పించాలని నా ఇంటికి వంద సార్లు వచ్చిండు
- విమర్శలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
యాదాద్రి, వెలుగు : 'తుంగతుర్తి టికెట్ఇప్పించాలని మందుల సామేల్ నా వద్దకు వంద సార్లు వచ్చిండు. తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్‌చేసి అడిగిండు. చాలా మంది టికెట్‌కోసం పోటీ పడినా తుంగతుర్తి టికెట్ఆయనకు ఇప్పించి, గెలిపించాను' అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 'తుంగతుర్తితో నాకు సంబంధం లేదంటున్న సామేల్.. టికెట్ ఇప్పించాలని నన్ను ఎందుకు అడిగిండు, టికెట్ ఇప్పించిన నన్నే విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్న' అని అన్నారు.
మందుల సామేల్ వంటి తప్పుడు వ్యక్తికి టికెట్ఇప్పించి, గెలిపించినందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు క్షమాపణ కోరుతున్నానని చెప్పారు. మునుగోడులో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తాను తుంగతుర్తి, నకిరేకల్, భువనగిరి, ఆలేరు, సూర్యాపేటలో ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించానని గుర్తు చేశారు. మందుల సామేల్ గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చు చేశారని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా చూడాలని జగ్గారెడ్డికి చెప్పానన్నారు. తుంగతుర్తి, నకిరేకల్సహా అనేక నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో అవమానాలు భరించలేకే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారానని చెప్పారు.
అందరు ఎమ్మెల్యేల మాదిరిగా పదవిలో ఉంటూ పార్టీ మారలేదని, తర్వాత అందరూ కోరితేనే తిరిగి కాంగ్రెస్‌లో చేరానని చెప్పారు. కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన తర్వాతే స్టేషన్‌ఘన్ పూర్ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీలో చేరారని, ఆ తర్వాతే ఆయన కూతురు కావ్యకు ఎంపీ టికెట్ఇచ్చి గెలిపించుకున్నామని తెలిపారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. తనను విమర్శించిన సామేల్ పై ఎవరూ విమర్శలు చేయొద్దని సూచించారు. రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
