సింగ్ గీతం మూవీలో విలన్‌‌గా నవ్విస్తా: శాలిని కొండెపూడి

సింగ్ గీతం మూవీలో విలన్‌‌గా నవ్విస్తా: శాలిని కొండెపూడి

శుభం, మై డియర్ దొంగ చిత్రాలతో హీరోయిన్‌‌గా ఆకట్టుకున్న శాలిని కొండెపూడి.. ఇప్పుడు ‘సింగ్‌‌ గీతం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. సీనియర్ డైరెక్టర్‌‌‌‌ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్‌‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. జూన్‌‌ 11న సినిమా రిలీజ్ సందర్భంగా శాలిని మాట్లాడుతూ ‘ఇందులో నాది నెగెటివ్ షేడ్స్‌‌ ఉండే విలన్ పాత్ర. 

భారతీయ సినీ చరిత్రలోనే తొలి మ్యూజికల్ కామెడీ ఫిల్మ్ ఇది.  ఇలాంటి జానర్‌‌లో ఇప్పటివరకు సినిమా రాలేదు. ఇందులో మాటలనే పాటలాగా పాడాలి. అదే మాకు అసలైన ఛాలెంజ్. ప్రతి ఆర్టిస్ట్‌‌కు కొంచెమైనా శృతిలో పాడటం రావాలి. ఇందుకోసం చాలా వర్క్ షాప్స్ చేశాం. ఇది ‘కుబేరపురం’ అనే ఒక ఫిక్షనల్ విలేజ్‌‌లో జరిగే స్టోరీ.

ఆ ఊర్లో అందరూ ఎందుకలా పాటల రూపంలో మాట్లాడతారు అనేది థియేటర్‌‌‌‌లోనే చూడాలి. ఆయాన్, అహల్యా బమ్రూతో పాటు నా పాత్ర ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా ఉంటుంది.  నా క్యారెక్టర్‌‌‌‌లో చాలా షేడ్స్‌‌ ఉంటాయి.  సింగీతం గారి గత చిత్రాల తరహాలోనే ఇది వినూత్నంగా ఉంటుంది.  దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు’ అని చెప్పింది