కేజ్రీవాల్ ను సీఎంగా తప్పించండి.. పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు

కేజ్రీవాల్ ను సీఎంగా తప్పించండి.. పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు

లిక్కర్ స్కాంలో  రోజురోజుకు విచారణ పేరుతో రాజకీయం వేడెక్కుతోంది.  గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ ముఖ్య మంత్రి పదవి నుంచి తప్పించాలని సుర్జీత్ సింగ్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విటిషన్ విచారణకు వచ్చింది. దీంతోపాటు  ఈడీ కస్టడీని మరో వారం రోజులు పొడిగించాలని రూస్ అవెన్యూ కోర్టును కోరింది. నేను ఏం చేశానని అరెస్ట్ చేశారని కోర్టులో కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈడీ వాదనను  కోర్టు రిజర్వ్ లో పెట్టింది. ఈ రెండు విచారణల్లో కేజ్రీవాల్ కు కాస్త ఊరట కలిగించే తీర్పులు వచ్చాయి.

మద్యం పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అటు  కేజ్రీవాల్ కస్టడీని 7 రోజులు పొడిగించాలని కోరుతూ ED చేసిన పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని 7 రోజులు పొడిగించాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన పిటిషన్‌పై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.

Also Read:తొమ్మిది నిమ్మకాయలు.. రూ. 2 లక్షల 30 వేలు