బాంబుల్ని పేలకుండా చేసే రోబో

బాంబుల్ని పేలకుండా చేసే రోబో

ఇప్పటిదాకా బాంబ్ స్క్వాడ్ మాత్రమే బాంబుల్నినిర్వీర్యం చేస్తోంది. దాని వల్ల వాళ్ల ప్రాణానికీ ప్రమాదం కలిగే అవకాశం ఉంది. మరి, బాంబుల్ని రోబోలు తీసి పారేస్తే ఎలా ఉంటుంది? అతి త్వరలోనే అది సాధ్యం కాబోతోంది. అయితే, ప్రస్తుతానికి అది కేవలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కే ఆ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సొంత టెక్నాలజీతో ఆ రోబోను తయారు చేసింది. దాని పేరు అన్ ఎక్స్ప్లోడెడ్ ఆర్డ్​నెన్స్ హ్యాండ్లింగ్ రోబో (యూఎక్స్ వోఆర్ యుక్షర్ ). ఐఏఎఫ్ ఇప్పటికే దానిపై ఎన్నో ట్రయల్స్ చేసిందని, అతి త్వరలోనే ఐఏఎఫ్ కు యుక్షర్ ను అందిస్తామని డీఆర్డీవో సైంటిస్ట్​ అలోక్ ముఖర్జీ చెప్పారు. 2 కిలోమీటర్ల దూరం నుంచి ఆ రోబోలను కంట్రోల్ చేయొచ్చని, హై ప్రెజర్ వాటర్ జెట్ల ద్వారాపేలని బాంబులను గుర్తించి, నిర్వీర్యం చేసేయొచ్చని చెప్పారు. ఐఏఎఫ్ ఈ రోబోలను తీసుకోవడం వెనక పెద్ద కారణమే ఉంది. పాకిస్థాన్ పై బాలాకోట్ ఎటాక్స్ తర్వాత, ఆ దేశం మన మిలటరీ బేస్ లను టార్గెట్ గా చేసుకుని బాంబులు వేసింది. వాటిలో చాలా వరకు పేలకుండా ఉండిపోయాయట. వాటి వల్ల భవిష్యత్తులో పెద్ద ముప్పే పొంచి ఉందని భావించిన ఐఏఎఫ్ ,బాంబులను డిఫ్యూజ్ చేసే రోబోలపై దృష్టి పెట్టారు.అందులో భాగంగానే యుక్షర్ ను సమీకరించుకుంటోంది. వెయ్యి కిలోల బాంబుల వరకు ఈ రోబో డిఫ్యూజ్ చేయగలదట.