బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇబ్రాం శేఖర్ బాధ్యతలు

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా  ఇబ్రాం శేఖర్ బాధ్యతలు

మెహిదీపట్నం, వెలుగు: బీఎస్పీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఇబ్రాం శేఖర్ శుక్రవారం పార్టీ స్టేట్​ఆఫీస్​లో బాధ్యతలు స్వీకరించారు.  అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ కోసం వేలాది మంది బహుజనులు ఆత్మహత్య చేసుకుంటే అధికారం మాత్రం అగ్రవర్ణాలకు దక్కిందన్నారు. 

 పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ​దోపిడీ చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో బహుజన రాజ్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల ఇన్​చార్జిగా ఎం.బాలయ్య, స్టేట్ సెంట్రల్ కోఆర్డినేటర్లుగా దాగిళ్ల దయానంద్, నిషాని రామచందర్, ప్రధాన కార్యదర్శులుగా బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్, బోడపట్ల ఈశ్వర్​ను నియమించారు.