కరోనా రాకుంటే ఎన్ఆర్ఐ పాలసీ తెచ్చెటోళ్లం

కరోనా రాకుంటే ఎన్ఆర్ఐ పాలసీ తెచ్చెటోళ్లం
  •  గల్ఫ్​కు వెళ్లొద్దు.. ఇక్కడే ఉపాధి వెతుక్కోవాలి: కేటీఆర్ 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: గల్ఫ్​ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ పాలసీ తేవాలని తమ ప్రభుత్వ హయాంలో అనుకున్నామని, కానీ కరోనా కారణంగా చేయలేకపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్యెల్యే కేటీఆర్ అన్నారు. తాము మూడోసారి అధికారంలోకి వస్తే ఎన్ఆర్ఐ పాలసీ తెచ్చేవాళ్లమని చెప్పారు. బుధవారం ఆయన సిరిసిల్లలో పర్యటించారు. దుబాయ్​లో ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని18 ఏండ్లు జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలైన శివరాత్రి మల్లేశం, రవి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రెండు నెలల్లో వారికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

భార్యాబిడ్డలను వదిలి ఏండ్లకేండ్లుగా గల్ఫ్​లో ఉపాధి పొందుతున్న కార్మికులు తిరిగి రావాలని కోరారు. రాష్ట్రంలో అవకాశాలు కోకోల్లలుగా ఉన్నాయని, నకిలీ ఏజెంట్లను నమ్మి గల్ఫ్ వెళ్లకుండా ఇక్కడే ఉపాధి వెతుక్కోవాలన్నారు. ఇతర రాష్ట్రాల కార్మికులు వచ్చి తెలంగాణలో ఉపాధి పొందుతున్న విషయాన్ని గుర్తించాలన్నారు.