
తాను ఎవరినైనా బాధపెట్టినట్లయితే.... దానికి చింతిస్తున్నానని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అన్నారు. తాను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదని చెప్పారు. ఎవరైనా సినిమా చూడకూడదనుకుంటే, వారి సెంటిమెంట్‌ను తప్పకుండా గౌరవిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇకపోతే స్టార్ హీరోలలో ఒకరైన అమీర్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం లాల్ సింగ్ చడ్డా.. ఆగష్టు 11న పలు భాషల్లో రిలీజయ్యేందుకు సిద్ధంగా ఉంది. కాగా ఈ మూవీని బాయ్ కాట్ చేయాలని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమీర్ ఇటీవల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
కాగా లాల్ సింగ్ చడ్డా మూవీ రిలీజ్ దగ్గర పడుతుండడంతో... పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లలో బిజీగా మారిపోయారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా నటిస్తుండటంతో తెలుగు మార్కెట్ మీద కూడా బాగా ఫోకస్ చేసి ప్రమోషన్స్ చేస్తున్నారు అమీర్. ఇక అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
If I have hurt anyone by any means, I regret it. I don't want to hurt anyone. If someone doesn't want to watch the film, I'd respect their sentiment: Aamir Khan when asked about controversy around his upcoming film Laal Singh Chaddha & calls on social media to boycott it (09.08) pic.twitter.com/iZATYGPE90
— ANI (@ANI) August 10, 2022