- సంఘ్ కార్యకర్త స్థానం అత్యంత గౌరవప్రదమైనదని వ్యాఖ్య
ఉప్పల్, వెలుగు: ఆర్ఎస్ఎస్ లేకుంటే దేశం ముక్కలయ్యేదని, సంఘ్లేకుంటే భారతదేశ పరిస్థితిని ఊహించుకోవడం కూడా కష్టమేనని ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్శాఖలో దేశం, ధర్మం, సమాజ హితం కోసం పనిచేసే స్వయం సేవకులు తయారవుతారని, వీరి స్థానం డాక్టర్, లాయర్, పోలీస్, ఇంజినీర్కంటే ఘనమైనదన్నారు.
ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఆదివారం భారతీయ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించగా, ముఖ్య అతిథులుగా విజయేంద్ర ప్రసాద్, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం, ధర్మం కోసం పనిచేసే సంఘ్ కార్యకర్త స్థానం అత్యంత గౌరవప్రదమైనదన్నారు.
ఆర్ఎస్ఎస్ లేకుంటే భారతదేశం ముక్కలుచెక్కలయ్యేదని, దేశాన్ని ఏకతాటిపై ఉంచడంలో సంఘం పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్, ప్రొఫెసర్ కృష్ణయ్య, ప్రొఫెసర్ విజయచరణ్, డాక్టర్ రామకృష్ణ సహా పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

