ఇలా చేస్తే పళ్లు తెల్లగైతయ్

ఇలా చేస్తే పళ్లు తెల్లగైతయ్

పళ్ల మీద గార పట్టి పచ్చగా ఉంటే ఓపెన్‌‌గా నవ్వాలన్నా, మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఫీల్‌‌ అవుతుంటారు. మామూలుగా అయితే ఈ సమస్యలు స్మోకింగ్, జెనటిక్ డిజార్డర్‌‌‌‌, అన్‌‌హెల్దీ డైట్ వల్ల వస్తాయి. దీన్ని పోగొట్టాలంటే కొన్ని ఫ్రూట్స్‌‌ని  డైట్‌‌లో చేర్చుకోవాలి.  స్ట్రాబెర్రీల్లో ఉండే మాలిక్‌‌ యాసిడ్ పళ్లను తెల్లగా చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ నోట్లో ఉండే బ్యాక్టీరియాను పోగొడుతుంది.   యాపిల్‌‌లో మాలిక్‌‌ యాసిడ్ ఉంటుంది. ఇది లాలాజలం ప్రొడ్యూస్‌‌ అయ్యేలా చేసి పళ్లను తెల్లగా చేస్తుంది.  నోటిని డీటాక్సిక్ చేయడానికి డైటరీ ఫైబర్స్, విటమిన్  బి6, మాంగనీస్ చాలా హెల్ప్ అవుతాయి. ఇవి అరటిలో ఎక్కువ ఉంటాయి. బ్రష్ చేసే ఐదు నిమిషాల ముందు 1‌‌‌‌–2 నిమిషాలు పాటు అరటితొక్కతో పళ్లమీద రుద్దితే బెటర్ రిజల్ట్ ఉంటుంది.  హైజినిక్ పళ్లకోసం స్మోకింగ్ మానేయాలి. ఫుడ్‌‌లో క్యారెట్, ఆకుకూరలు, బ్రకోలి తినాలి. రోజుకు రెండు సార్లు బ్రష్‌‌ చేయడం తప్పనిసరి.