
- 10 లక్షల ఎకరాల్లో ఏరియల్ స్ప్రేయింగ్
హైదరాబాద్, వెలుగు : సాగురంగంలో డ్రోన్వాడకాన్ని పెంచడానికి వ్యవసాయ డ్రోన్ టెక్నాలజీ కంపెనీ థానోస్, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆప్ లిమిటెడ్ (ఇఫ్కో)తో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తమిళనాడులోని దాదాపు 10 లక్షల ఎకరాల విస్తారమైన సాగుభూమిలో థానోస్ టెక్నాలజీస్ ఏరియల్ స్ప్రేయింగ్ చేస్తుంది.
ఇందుకోసం వాయు డ్రోన్, ఏరోటిక్స్ టెక్నాలజీస్, ఎలక్ట్రా అగ్రి గ్రీన్‌తో సహా ప్రముఖ డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్‌లతో కలసి పనిచేస్తుంది. సరైన సమయానికి పంటలపై పురుగుల మందులను చల్లడానికి 500 డ్రోన్లు వాడుతారు. ఇఫ్కో రసాయనాలు వాడే రైతులకు థానోస్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంది.