అశ్వారావుపేట, వెలుగు: మల్టీ జోన్–1 ఐజీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి శుక్రవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను, పరిసరాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్ లోని సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు.
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలపై వివరాలను అడిగి తెలుసుకుని, వాటి విచారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణను కట్టుదిట్టం చేయాలని, ప్రమాదాల తగ్గింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్, సీఐ నాగరాజు, ఎస్సైలు యయాతి రాజు, సాయి కిషోర్ రెడ్డి, అఖిల పాల్గొన్నారు.

