V6 News

గాజులరామారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

గాజులరామారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం సర్వే నంబర్ 49/6 లోని ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. గతంలో దిల్ సంస్థకు కేటాయించిన ఈ స్థలంలో ఎటువంటి కార్యకలాపాలు జరగట్లేదు. దీంతో ఈ భూమిపై కబ్జాదారులు కన్నువేసి ప్లాట్లుగా మార్చి పేదలకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు అందాయి. 

ఈ నేపథ్యంలో ఆర్ఐ ఖలీమ్ ఆధ్వర్యంలో సూరారం సాయిబానగర్ సమీపంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. తాజాగా నిర్మించిన 15 ఖాళీ గదులను గుర్తించి కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే సహించేది లేదని, కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.