Rain Alert: ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం.. హైదరాబాద్ లో కూడా..

Rain Alert: ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం.. హైదరాబాద్ లో కూడా..

ఆదివారం ( మే 25 ) తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.40 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్ గిరి,  నాగర్ కర్నూల్, నల్గొండ,నారాయణ్ పేట్, నిజామాబాద్, నిర్మల్, వరంగల్, హన్మకొండ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది వాతావరణ శాఖ. పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. కాగా.. నైరుతి రుతుపవనాలు చరుగ్గా కదులుతున్నాయి. 2025, మే 13న అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు.. తాజాగా కేరళకు విస్తరించాయి. మే 24 ఉదయం నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని టచ్ చేశాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. 

సాధారణంగా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. కానీ ఈ ఏడాది 8 రోజులు ముందే తీరాన్ని టచ్ చేశాయి. గత 16 సంవత్సరాలలో ఈ సారే కేరళలో రుతుపవనాలు తొలిసారిగా ప్రారంభమయ్యాయి. జూన్ ఫస్ట్ వీక్ లో నైరుతి రుతుపవనాలు తెలంగాణకు విస్తరించనున్నాయి.  

నైరుతి రుతు పవనాల రాకతో కేరళ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంత ప్రజలను అలర్ట్ చేయడంతో పాటు వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.