
భారత ప్రభుత్వం రియల్ మనీ గేమ్స్ పై ఆగస్టు 22న బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీలు కూడా కేవలం 96 గంటల్లోనే నిర్ణయానికి అనుగుణంగా మార్పులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కేవలం ఆగస్టు చివరి 9 రోజుల్లోనే గేమింట్ ఇండస్ట్రీ రూ.2వేల 500 కోట్ల మేర విలువైన యూపీఐ చెల్లింపుల తగ్గుదల నమోదైందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ వెల్లడించింది.
ఆగస్టు నెలలో గేమింగ్ సెక్టార్ రూ.7వేల 441 కోట్ల విలువైన 271 మిలియన్ ట్రాన్సాక్షన్లను నమోదు చేసిందని వెల్లడైంది. వాస్తవానికి ఇది జూలైతో పోల్చితే 25 శాతం తగ్గుదల కావటం గమనార్హం. జూలైలో గేమింగ్ ఇండస్ట్రీలో యూపీఐ చెల్లింపుల మెుత్తం విలువ రూ.10వేల 076 కోట్లుగా ఉంది. రియల్ మనీ గేమ్స్ వాలెట్ లోడింగ్ 90 శాతం యూపీఐ ద్వారానే ప్రతినెల జరుగుతున్నందున ఇది నెలకు రూ.10వేల కోట్లకు పైనే ఉంది.
కేవలం గేమింగ్ పరిశ్రమ మాత్రమే ప్రతినెల సగటున 3.5 కోట్ల నుంచి 4 కోట్ల ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తుందని తెలుస్తోంది. వీటి మెుత్తం విలువ నెలకు రూ.25 లక్షల కోట్లకు సమానంగా డేటా చెబుతోంది. 2025 ఏప్రిల్ మాసంలో అత్యధికంగా గేమింగ్ రంగంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ 500 మిలియన్లుగా ఉంది. వాస్తవానికి ఐపీఎల్ సీజన్ కావటంతో ట్రాన్సాక్షన్స్ సంఖ్య భారీగా ఉందని వెల్లడైంది.