ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత

ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత

ఢిల్లీలో బ్యాడ్ వెదర్ కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 385గా నమోదైంది. నోయిడాలో 444గా నమోదైంది. అశోక్ విహార్, ఆనంద్ విహార్ లో గాలినాణ్యత మరింత పడిపోయింది. ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో  గాలి నాణ్యత దారుణంగా ఉందని వాతావరణ శాఖ  అధికారులు  చెబుతున్నారు. ఢిల్లీలోని  దిర్ పూర్లో 594, గుర్ గ్రామ్లో  391 గా నమోదైందని వాతావరణ  శాఖ  వివరించింది.

చలి తీవ్రత..
చలితీవ్రత కూడా పెరిగిందని అధికారులు చెప్పారు. మంచుకూడా భారీగా కురుస్తుండటంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీ శివారు ప్రాంతాల్లో పంట వ్యర్థాలు తగలబెడుతుండటంతో గాలికాలుష్యం పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. 


ఢిల్లీలో గాలి  నాణ్యత  అక్టోబర్ 29న అత్యధికంగా 397గా నమోదైంది. ఈ  ఏడాది జనవరి తర్వాత  గాలి  నాణ్యత  ఇంత దారుణంగా  పడిపోవడం ఇది తొలిసారి. అయితే దీపావళి  సందర్భంగా బాణసంచా  కాల్చడం  ద్వారా గాలి నాణ్యత భారీగా  పడిపోయిందని  అధికారులు తెలిపారు.