2015లోనే గుజరాత్ కు కరోనా వచ్చింది..కానీ అది వైరస్ కాదు

2015లోనే గుజరాత్ కు కరోనా వచ్చింది..కానీ అది వైరస్ కాదు

2019 డిసెంబర్ నెలలో చైనా  వుహాన్ మార్కెట్ నుంచి ప్రారంభమైన ఈ  కరోనా వైరస్ ప్రపంచ దేశాల్ని అతలాకుతులం చేస్తోంది. ఆర్ధిక వ్యవస్థ  చిన్నాభిన్నమైంది. కోట్లాది మంది తమ ఉద్యోగాల్ని పోగొట్టుకొని రోడ్డున పడ్డారు. అంతటి విలయతాండవం చేస్తున్న కరోనా  గుజరాత్ కు 2015లోనే వచ్చింది. అదేంటి..? 2015లో గుజారాత్ కు కరోనా ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతున్నారా..?

2015 గుజరాత్ లో  కరోనా పేరుతో  ఓ హోటల్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ హోటల్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు.

గుజరాత్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమైన బనస్కాంత  హైవే పక్కన 2015లో ఈ హోటల్ ను ప్రారంభించారు. ప్రయాణం చేసేవారు, వాహనదారులు ఆహోటల్లో సేదతీరు తమ గమ్య స్థానాలకు వెళ్లేవారు. అయితే ఈ కరోనా వైరస్ తో ఆ హోటల్ ను పూర్తిగా మూసేసినా పలువురు వాహనదారులు ఆ హోటల్ ఎదుట సెల్ఫీలు దిగుతున్నారు. అందుకు కారణం కరోనా అని హోటల్ కు పేరుపెట్టడమే.

గుజరాత్‌ సిద్ధా పూర్ కు చెందిన బర్కత్ 2015లో ఈ హోటల్ ను ప్రారంభించారు. కొత్తగా ప్రారంభిస్తున్న తన  హోటల్ కు ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తుండగా కరోనా అనే పేరు స్ట్రైక్ అయినట్లు చెప్పాడు. కరోనా అంటే అర్ధం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కరోనా అంటే  ఉర్దూలో గెలాక్సీ అని అర్ధం. దీంతో పేరు బాగుందని  ఆ హోటల్ కు కరోనా అని నామకరణం చేసినట్లు ..యజమాని బర్కత్ చెప్పాడు.

లాక్ డౌన్  సమయంలో ఆ హైవే నుంచి వెళుతున్న ప్రజలు కరోనా పేరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని, హోటల్ ఎదుట ఆగి ఫోటోలు, సెల్ఫీలు దిగుతున్నారని అన్నాడు. కరోనా ఇంతటి ప్రళయం సృష్టించడంపై ఆందోళన వ్యక్తం చేసిన బర్కత్..తన హోటల్ కు 2015లో కరోనా అని పేరు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుందన్నాడు.