ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ శునకం ‘జూమ్’

ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ శునకం ‘జూమ్’

రెండు బుల్లెట్లు దిగినా లెక్కచేయని జూమ్

ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన శునకం

జమ్మూకాశ్మీర్‌ : అనంతనాగ్ జిల్లా తంగ్ పావా ప్రాంతంలో ఈనెల 10వ తేదీన భారత ఆర్మీ బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీకి చెందిన జూమ్(Zoom) అనే జాగిలం తీవ్రంగా గాయపడింది. ఉగ్రవాదులు తలదాచుకున్న ఓ ఇంట్లోకి భారత బలగాలు జూమ్ జాగిలాన్ని పంపారు. ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటిపై దాడి చేసి, చేజ్‌ చేసే సమయంలో జూమ్‌ టెర్రరిస్టులను గుర్తించి దాడి చేసింది. ఆ సమయంలో కుక్క శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. అయినప్పటికీ.. లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడింది. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు లొంగిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించగా, పలువురు భారత జవాన్లు గాయపడ్డారు.

తీవ్రంగా గాయపడిన జూమ్‌ను వెంటనే ఆర్మీ వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జూమ్ కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. జూమ్ తన టాస్క్ కచ్చితంగా నెరవేర్చడం వల్లనే ఉగ్రవాదులను తాము మట్టుపెట్టగలిగామని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. జూమ్ త్వరగా కోలుకోవాలని ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. ఆర్మీ శిక్షణ పొందిన ఈ జాగిలం చాలా క్రూరమైనది. ఉగ్రవాదుల జాడను పసికట్టడంలో మహా దిట్ట. ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసి, పట్టుకోవడంలో తర్ఫీదు పొందిందని అధికారులు తెలిపారు.