పెరిగిన సిటీ బస్ పాస్ ఛార్జీల వివరాలు

పెరిగిన సిటీ బస్ పాస్ ఛార్జీల వివరాలు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ లో సిటీ బస్సు ఎక్కాలంటే కనీసం పది రూపాయలు చెల్లించాల్సిందే. ఆర్డినరీ బస్సుల్లో ఇన్నాళ్లు ఉన్న కనీస ఛార్జి5 రూపాయలను 10 పది రూపాయలుగా నిర్ణయించారు. ప్రతి ప్రయాణంపై 5 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించటంతో సిటీ బస్సులకు సంబంధించి నిర్ణయించిన ఛార్జీలను గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు. సోమవారం జూబ్లీ బస్టాండ్ లోని ఈడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెంచిన ఛార్జీల వివరాలను వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మాదిరిగా కిలోమీటర్ల లెక్కన కాకుండా కనీస ఛార్జీలు, రూట్ ను బట్టి ఛార్జీలు పెంచారు.

సిటీ బస్సుల్లో కిలోమీటర్ల లెక్క ఛార్జీలు పెంచటం ద్వారా ఆర్టీసీకి పెద్దగా లాభం లేదని మినిమం ఛార్జీలు, రూట్ ల వారీగానే ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ అధికారులు సూచించటంతో సీఎం కేసీఆర్ సైతం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మినిమం ఛార్జీ 10 రూపాయలు చేయటంపైనే ఎక్కువ కసరత్తు జరిగింది. వాస్తవానికి సోమవారం నుంచే ఛార్జీలు అమల్లోకి రావాల్సి ఉన్నా సిటీ బస్సుల ఛార్జీల విషయంలోనే ఆలస్యం జరిగింది. చివరకు చిల్లర సమస్య లేకుండా మినిమం ఛార్జ్ ను పది రూపాయలు చేయాలని నిర్ణయించారు. అదే విధంగా ఎంత దూరం అన్నదాంతో సంబంధం లేకుండా మొత్తంగా  5 రూపాయలను పెంచారు. దీంతో ఏ స్టేజీ ఏ బస్సు, ఏ రూట్ అయినా సరే గతంలో ఉన్న ఛార్జీ కన్నా 5 రూపాయలు ఎక్కువ కానుంది. ఉదాహరణకు  ఎల్బీ నగర్ నుంచి పటాన్ చెరు వెళ్లే రూట్​లో దిల్ సుఖ్ నగర్ లో దిగాలనుకుంటే గతంలో 15 రూపాయలుంటే అది20 రూపాయలు అవుతుంది. ఎల్బీ నగర్ నుంచి పటాన్ చెరు వరకు 30 రూపాయల ఛార్జ్ ఉంటే అది ఇప్పుడు 35 రూపాయలు అవుతుంది.

ఐతే మెట్రో ఎక్స్ ప్రెస్ లో మాత్రం కనీస ఛార్జీ పది రూపాయలను మూడు స్టేజీల వరకు అలాగే ఉంచారు. నాలుగో స్టేజీ నుంచి 5 రూపాయలు ఛార్జ్ అదనంగా చెల్లించాలి. ఈ లెక్కన ప్రతి ప్రయాణం పై ఆర్టీసీకి అదనంగా 5 రూపాయలు రానుంది. ఐతే సుదూర దూరాలు అంటే ఆర్డినరీ లో 44 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే మాత్రం పదిరూపాయల ఛార్జ్ పెంచారు. మెట్రో ఎక్స్ ప్రెస్, డీలక్స్ లకు ఈ దూరం 34 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఇంతకన్నా ఎక్కువ దూరం ప్రయాణిస్తే టిక్కెట్ పై పది రూపాయలు పెరుగుతుంది.

ఏసీ బస్సుల ఛార్జీలు త్వరలోనే తగ్గింపు

అన్ని బస్సుల ఛార్జీలు పెంచుతున్నప్పటికీ ఏసీ బస్సుల ఛార్జీలు మాత్రం తగ్గించాలని నిర్ణయించారు. ఆశించిన స్థాయిలో ప్రయాణికుల నుంచి ఈ  బస్సులకు స్పందన లేదు. కారణం ఈ బస్సు గరిష్ట ఛార్జీ దాదాపు వంద రూపాయలకు పైగా ఉంది. దీంతో ప్రయాణికులు ఏసీ బస్సుల పట్ల ఆసక్తి చూపటం లేదు. దీంతో ఏసీ బస్సుల ఛార్జీలను భారీగా తగ్గించాలని నిర్ణయంచారు. మరో నాలుగైదు, రోజుల్లో వీటి ఛార్జీలు తగ్గిస్తామని గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. గరిష్ట ధర రూ.70 ఉండే అవకాశం ఉంది.

 

స్టూడెంట్ బస్ టిక్కెట్ కేటగిరీ (3 నెలలు)                ప్రస్తుతం     పెంచిన మొత్తం

రూట్ పాస్ 4 కి. మీ                        130                 165

రూట్ పాస్ 8 కి. మీ                        160                 200

రూట్ పాస్ 12 కి. మీ                      195                 245

రూట్ పాస్ 18 కి. మీ                      225                 280

రూట్ పాస్ 22 కి. మీ                      265                 330

హై స్కూల్, కాలేజ్  స్టూడెంట్స్  స్పెషల్ రూట్ పాస్

బస్ టిక్కెట్ కేటగిరీ (3 నెలలు)        ప్రస్తుతం           పెంచిన మొత్తం

రూట్ పాస్ 5 కి.మీ                        235                 310

రూట్ పాస్ 10 కి.మీ                       315                 415

రూట్ పాస్ 15 కి.మీ                       385                 510

రూట్ పాస్ 20 కి.మీ                       510                 675

రూట్ పాస్ 25 కి.మీ                       645                 850

రూట్ పాస్ 30 కి.మీ                       705                 930

రూట్ పాస్ 35 కి.మీ                       775                 1025

హై స్కూల్, కాలేజ్  స్టూడెంట్స్ స్పెషల్ రూట్ పాస్

బస్ టిక్కెట్ కేటగిరీ (నెల)              ప్రస్తుతం           పెంచిన మొత్తం

రూట్ పాస్ 5 కి.మీ                        85                  115

రూట్ పాస్ 10 కి.మీ                       105                 140

రూట్ పాస్ 15 కి.మీ                       135                 180

రూట్ పాస్ 20 కి.మీ                       180                 240

రూట్ పాస్ 25 కి.మీ                       225                 300

రూట్ పాస్ 30 కి.మీ                       250                 330

రూట్ పాస్ 35 కి.మీ            270        355

దూర ప్రాంతాలకైతే రూట్ ను బట్టి పది రూపాయల పెంపు

ఆర్డినరీలో    22 స్టేజీలు అంటే 44 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ప్రయాణమైతే రూ.10 పెంపు

మెట్రో ఎక్స్ ప్రెస్ లో34 స్టేజీలు అంటే 68 కి.మీ.కన్నా ఎక్కువ ప్రయాణమైతే రూ. 10 పెంపు

పెంచిన జనరల్​ బస్ పాస్ ఛార్జీలు

బస్ కేటగిరి                    ప్రస్తుతం                        పెంచిన మొత్తం

ఆర్డినరీ                           770                    950

మెట్రో ఎక్స్ ప్రెస్                 880                    1070

మెట్రో డీలక్స్                    990                    1185

ఎన్జీఓస్ నెలవారీ పాస్ లు

బస్ కేటగిరి                    ప్రస్తుతం                        పెంచిన మొత్తం

ఆర్డినరీ                           260                    320

మెట్రో ఎక్స్ ప్రెస్                 370                    450

మెట్రో డీలక్స్                    480                    575

ప్రస్తుతం          పెంచిన మొత్తం

ఎంఎంటీఎస్ – ఆర్టీసీ కాంబో పాస్          880               1090

ట్రావెల్ యాజ్ యూ లైక్ టిక్కెట్ (నాన్ ఏసీ)         80                                100

స్టూడెంట్ బస్ పాస్

జనరల్ బస్(సిటీ లిమిట్స్)           ప్రస్తుతం                        పెంచిన మొత్తం

(నెల రోజులకు)                 130                    165

జనరల్ బస్        

(మూడు నెలలకు              390                    495

స్టూడెంట్ బస్ పాస్

జనరల్ బస్(గ్రేటర్ లిమిట్స్)         ప్రస్తుతం                        పెంచిన మొత్తం

(నెల రోజులకు)                165                    215

జనరల్ బస్

(మూడు నెలలకు )                        495                    645

స్టూడెంట్స్ స్పెషల్​ పాస్

జనరల్ బస్                   ప్రస్తుతం                        పెంచిన మొత్తం

(నెల రోజులకు)                210                    260

జనరల్ బస్

( మూడు నెలలకు)                        630                    780