V6 News

పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్ టైమ్... ఏకాగ్రత లోపం, నిద్రలేమి ముప్పు..

పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్ టైమ్... ఏకాగ్రత లోపం, నిద్రలేమి ముప్పు..
  • రాజస్థాన్ ఆసుపత్రి అధ్యయనంలో వెల్లడి

జైపూర్: పిల్లలు మొబైల్స్​ఎక్కువగా వాడుతుండడంతో వారి ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయని రాజస్థాన్ ప్రభుత్వ సవాయ్ మాన్ సింగ్ (ఎస్ఎంఎస్) ఆస్పత్రి నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. మితిమీరిన స్క్రీన్ టైమ్ కారణంగా పిల్లల్లో ఏకాగ్రత తగ్గడం, ఒంటరితనం పెరగడం, నిద్రలేమి సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ జయశ్రీ జైన్ నేతృత్వంలో 10 నుంచి16 ఏళ్ల మధ్య వయస్సు గల 150 మంది పిల్లలపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో 72% మంది పిల్లలు రోజుకు 3 నుంచి 6 గంటల పాటు మొబైల్ వాడుతున్నట్లు తేలింది. 

సోషల్ మీడియా, వీడియోలు చూస్తున్నప్పుడు మెదడులో 'డొపమైన్' విడుదలవుతుందని, ఇది పిల్లలను పదేపదే ఫోన్ వాడేలా ప్రేరేపిస్తుందని ఆమె వివరించారు.