ఇండియా తడబ్యాటు.. తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో స్కోర్ ఎంతంటే.?

ఇండియా తడబ్యాటు.. తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో  స్కోర్ ఎంతంటే.?

లండన్‌‌‌‌: ఇంగ్లండ్‌‌‌‌తో గురువారం ప్రారంభమైన ఆఖరిదైన ఐదో టెస్ట్‌‌‌‌లో ఇండియాకు శుభారంభం లభించలేదు. ఇంగ్లిష్ పేసర్లు చేసిన ముప్పేట దాడిలో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. కరుణ్‌‌‌‌ నాయర్‌‌‌‌ (52 బ్యాటింగ్‌‌‌‌), సాయి సుదర్శన్‌‌‌‌ (38) మోస్తరుగా ఆడటంతో.. తొలి రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌కు ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 64 ఓవర్లలో 204/6 స్కోరు చేసింది. నాయర్‌‌‌‌తో పాటు వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌ (19 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌‌‌‌ కోసం టీమిండియా ప్లేయింగ్​ఎలెవన్‌‌‌‌లో నాలుగు మార్పులు చేసింది. బుమ్రా, అన్షుల్ కాంబోజ్‌‌‌‌, శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌, రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో ఆకాశ్‌‌‌‌ దీప్‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ, కరుణ్‌‌‌‌ నాయర్‌‌‌‌, ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌ జట్టులోకి వచ్చారు.  

ఓపెనర్లు ఫెయిల్‌‌‌‌..

టాస్‌‌‌‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. పచ్చికతో కూడిన పిచ్‌‌‌‌పై బాల్‌‌‌‌ ఊహించిన విధంగా సీమ్‌‌‌‌ అయినా విపరీతంగా స్వింగ్ కాలేదు. ఈ సిరీస్‌‌‌‌లో తొలి మ్యాచ్‌‌‌‌ ఆడుతున్న అట్కిన్సన్‌‌‌‌ (2/31).. రెండో ఓవర్‌‌‌‌లోనే  యశస్వి జైస్వాల్‌‌‌‌ (2)ను ఎల్బీ చేశాడు. కానీ అంపైర్‌‌‌‌ ఔట్‌‌‌‌ ఇవ్వలేదు. ఇంగ్లండ్ రివ్యూకు వెళ్లినా ఫలితం దక్కలేదు. మిగిలిన పేసర్లు జోష్‌‌‌‌ టంగ్‌‌‌‌, జెమీ ఓవర్టన్‌‌‌‌ బంతిపై పట్టుకోసం శ్రమించారు. టంగ్‌‌‌‌ తన తొలి ఓవర్‌‌‌‌లోనే బాల్‌‌‌‌ను రెండు వైపులా స్వింగ్ చేయబోయి ఎక్కువగా వైడ్స్‌‌‌‌ వేశాడు. ఫలితంగా 12 రన్స్‌‌‌‌ వచ్చాయి. అయితే నాలుగో ఓవర్‌‌‌‌లో అట్కిన్సన్‌‌‌‌ వేసిన ఇన్‌‌‌‌ స్వింగర్‌‌‌‌కు జైస్వాల్‌‌‌‌ ఎల్బీ అయ్యాడు. తొలి గంటలో ఇండియా 36/1 స్కోరు చేసింది. ఈ సిరీస్‌‌‌‌లో అద్భుతంగా ఆడిన కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (14) తొలిసారి నిరాశపర్చాడు. క్రిస్‌‌‌‌ వోక్స్‌‌‌‌ షార్ట్‌‌‌‌ బాల్స్‌‌‌‌ను వదిలేసి ముందుకు సాగాడు. కానీ 16వ ఓవర్‌‌‌‌లో శరీరానికి చాలా దగ్గరగా వచ్చిన బాల్‌‌‌‌ను కట్‌‌‌‌ చేయబోయి వికెట్ల పైకి ఆడుకున్నాడు. 38/2తో కష్టాల్లో పడిన ఇండియాను సాయి సుదర్శన్‌‌‌‌, శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (21)  గట్టెక్కించే ప్రయత్నం చేశారు. టంగ్‌‌‌‌, వోక్స్‌‌‌‌ను టార్గెట్‌‌‌‌ చేసి ఒకటి, రెండు ఫోర్లు బాదారు. అయితే వాతావరణం మేఘావృతంగా ఉండటంతో అకస్మాత్తుగా వర్షం పడింది. ఇండియా 72/2తో లంచ్‌‌‌‌కు వెళ్లింది. గ్రౌండ్‌‌‌‌ చిత్తడిగా మారడంతో ఆటకు రెండు గంటల పాటు అంతరాయం కలిగింది. రెండో సెషన్‌‌‌‌ చివర్లో ఆరు ఓవర్లు మాత్రమే ఆడిన ఇండియా ఒక్క వికెట్‌‌‌‌ కోల్పోయింది. ఇన్నింగ్స్‌‌‌‌ 28వ ఓవర్‌‌‌‌లో అట్కిన్సన్‌‌‌‌ వేసిన బాల్‌‌‌‌ను ఆఫ్‌‌‌‌ సైడ్‌‌‌‌లోకి నెట్టి రన్‌‌‌‌ కోసం పరుగెత్తాడు. కానీ ఫాలో త్రూలో బాల్‌‌‌‌ను అందుకున్న అట్కిన్సన్‌‌‌‌ డైరెక్ట్‌‌‌‌ త్రోతో వికెట్లను పడగొట్టాడు. గిల్‌‌‌‌ రనౌట్‌‌‌‌తో ఇండియా 83/3తో మరిన్ని కష్టాల్లో పడింది. మూడో వికెట్‌‌‌‌కు 45 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగియగా 85/3తో టీ బ్రేక్‌‌‌‌కు వెళ్లింది. 

ఆదుకున్న నాయర్‌‌‌‌..

టీ బ్రేక్‌‌‌‌ తర్వాత మూడో సెషన్‌‌‌‌లోనూ ఇండియా తేరుకోలేకపోయింది. ఓ ఎండ్‌‌‌‌లో కరుణ్‌‌‌‌ నాయర్‌‌‌‌ పాతుకుపోయినా.. రెండో ఎండ్‌‌‌‌లో వరుస విరామాల్లో వికెట్లు పడ్డాయి. అప్పటి వరకు నిలకడగా ఆడుతున్న సుదర్శన్‌‌‌‌ను 36వ ఓవర్‌‌‌‌లో టంగ్‌‌‌‌ వెనక్కి పంపాడు. ఫలితంగా నాలుగో వికెట్‌‌‌‌కు 18 రన్స్‌‌‌‌ జతయ్యాయి. మరో నాలుగు ఓవర్ల తర్వాత జడేజా (9) వెనుదిరిగాడు. ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌ (19)తో కలిసి ఇన్నింగ్స్‌‌‌‌ను కాపాడే బాధ్యత తీసుకున్న నాయర్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌తో స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేశాడు. ఇక ఫర్వాలేదనుకుంటున్న టైమ్‌‌‌‌లో మళ్లీ బౌలింగ్‌‌‌‌కు వచ్చిన అట్కిన్సన్‌‌‌‌.. జురెల్‌‌‌‌ను దెబ్బకొట్టాడు. బ్యాక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌ను ఆడే క్రమంలో జురెల్‌‌‌‌ రెండో స్లిప్‌‌‌‌లో బ్రూక్‌‌‌‌కు చిక్కాడు. ఆరో వికెట్‌‌‌‌కు 30 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌ చివరి వరకు వికెట్‌‌‌‌ కాపాడుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి 51 రన్స్‌‌‌‌ జోడించి రోజును ముగించారు. 

సంక్షిప్త స్కోర్లు

  • ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 64 ఓవర్లలో 204/6 (కరుణ్‌‌‌‌ నాయర్‌‌‌‌ 52*, సుదర్శన్‌‌‌‌ 38, జోష్‌‌‌‌ టంగ్‌‌‌‌ 2/47). 
  • 1 ఒక టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌లో అత్యధిక రన్స్‌‌‌‌ చేసిన ఇండియా తొలి కెప్టెన్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (743). గావస్కర్‌‌‌‌ (732) రికార్డును బ్రేక్‌‌‌‌ చేశాడు. ఓవరాల్‌‌‌‌గా డాన్‌‌‌‌ బ్రాడ్‌‌‌‌మన్‌‌‌‌ (810), గ్రాహం గూచ్‌‌‌‌ (752) ముందున్నారు. 
  • 4 వరుసగా ఐదు టెస్ట్‌‌‌‌ల్లో టాస్‌‌‌‌ ఓడిన నాలుగో ఇండియన్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ గిల్‌‌‌‌. లాలా అమర్‌‌‌‌నాథ్‌‌‌‌ (1948–49 విండీస్‌‌‌‌పై), కపిల్‌‌‌‌ దేవ్‌‌‌‌ (1982–83 విండీస్‌‌‌‌పై), విరాట్‌‌‌‌ కోహ్లీ (2018 ఇంగ్లండ్‌‌‌‌పై) సరసన నిలిచాడు.