యాంకర్స్, హీరోయిన్లపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు

యాంకర్స్, హీరోయిన్లపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు

గచ్చిబౌలి, వెలుగు:  యాంకర్స్, హీరోయిన్లపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, కామెంట్స్ రాస్తున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్​క్రైమ్​పోలీసులు అరెస్ట్​ చేశారు. ఏపీలోని కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజు(30) మూడేండ్ల పాటు దుబాయ్ లో ప్లంబర్ గా వర్క్ చేశాడు. తర్వాత సిటీకి వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో​జాబ్ చేస్తున్నాడు. ఫేక్ ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ అకౌంట్లు క్రియేట్ చేసుకున్న వీర్రాజు అందులో టీవీ యాంకర్లు, సినిమా హీరోయిన్లకు చెందిన ఫొటోలను అప్​లోడ్ చేసి అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు.

దీనిపై ఈ నెల 17న యాంకర్ అనసూయ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం వీర్రాజును అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.